క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 3వ రంగము

 

3వ రంగము

(ఒక ప్రార్ధన మందిరములో కూటము జరుగుచుండగా ఆగస్టీన్ గారు, సుందరమ్మగారు, జకరయ్య గారు, సమూయేలు గారు, దేవదానం గారు లోపలికి వచ్చి కూర్చుంటారు)

అబద్ధ బోధకురాలు: (లేచి నిలువబడి చేతిలో బైబిలు పట్టుకుని బోధ చేయాలి) ప్రభువునందు ప్రియులారా! ఈనాడు మనచుట్టూ ఎన్నో వేలాది సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలను నమ్మకండి. కొందరు భోదకులు పాపములు ఒప్పుకుని, పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందాలంటున్నారు. ఆ బోధలు నమ్మకండి. యేసు మనకొరకు రెండువేల సంవత్సరాల క్రితమే శిలువలో చనిపోయి రక్తము చిందించినారు. అప్పుడే మన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు పశ్చాత్తాపపడనక్కరలేదు, నమ్మి బాప్తీస్మము పొందండి మీకు రక్షణ దొరుకుతుంది. 7 వారాలు మా ప్రార్ధనకు వచ్చారంటే మీరు అనుకున్న కార్యాలు జరుగుతాయి. మీ రోగాలు తగ్గిపోతాయి. ప్రభువు తన వాక్యమును దీవించుగాక! ఆమెన్! ఇప్పుడు మీ సమస్యలు చెప్పండి. ఒక్కొక్కరికి ప్రార్ధన చేస్తాను. మీ పేరేమిటి? మీ సమస్య చెప్పండి.

ఆగస్టీన్: నా పేరు ఆగస్టీన్ అండి. నాకు 20 సం.ల నుండి కడుపులో పుండ్లు...... బాధ.... అమ్మా.... అయ్యా.... నొప్పి.....

అబద్ధ బోధకురాలు: మీ పేరు చెప్పండి, మీ సమస్య ఏమిటి?

దేవదానం: అమ్మా 25సం.ల నుండి దగ్గు, ఆయాసము.. కూర్చుంటే లేవలేను, లెగిస్తే కూర్చోలేను...

అబద్ధ బోధకురాలు: మీ పేరు, మీ సమస్య?

జఖరయ్య: అమ్మా నా పేరు జఖరయ్య, నా పిల్లలకు ఒళ్ళంతా గజ్జి, తరచూ జ్వరాలు.

అబద్ధ బోధకురాలు: మీ పేరు, మీ సమస్య?

సమూయేలు: నా పేరు సామేలండి. నేను త్రాగుబోతునండి, త్రాగుడు మానలేకపోతున్నాను.

అబద్ధ బోధకురాలు: మీ పేరు, మీ సమస్య చెప్పండి.

సుందరమ్మ: నా పేరు సుందరమ్మండి. మా అబ్బాయిని దెయ్యము పట్టుకున్నాదండి.

అబద్ధ బోధకురాలు: చూడండి మా సంఘము అన్ని సంఘాలకంటే గొప్ప సంఘము. మా లాంటి సంఘము ఈ చుట్టుప్రక్కలలేదు. మేము ప్రార్ధనలు చేస్తే మీ రోగాలు తగ్గిపోతాయి. మేము ప్రార్ధనలు చేస్తే మీ రోగాలు తగ్గిపోతాయి. మేము ప్రార్ధనలు చేస్తే దెయ్యాలు పోతాయి. మేము ప్రార్ధనలు చేస్తే దుబాయి వెళ్లిపోతారు. మీకోరకు ప్రార్ధన చేస్తాను మోకరించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తుతి, హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ ప్రభువా ఈ బిడ్డలను బహుగా దీవించండి. ఆమేన్! ఆమేన్! ఆమేన్! వచ్చే ఆదివారం బాప్తీస్మములు తీసుకొనుటకు సిద్ధపడి రండి. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించునుగాక! మీ కృతజ్ఞతా కానుకలు పల్లెములో వేయండి. (పల్లెము పట్టుకుని నిలబడియుండాలి) (కానుకలు వేస్తూ ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోవాలి)

                                      *****************************

Comments