క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 5వ రంగము
5వ రంగము
(చివరిరోజు
ఉజ్జీవ కూటము అప్పటివరకు కొంత వాక్యము చెప్పినట్లుగా నటించాలి. ఈ కూటముల ద్వారా
మేలు పొందిన రోగులు సాక్ష్యములు చెప్పాలి)
పాస్టరు
గారు:
ప్రభువునందు ప్రియులారా ఈ మూడు దినములు ఉజ్జీవ సభల ద్వారా మేలు పొందినవారు దయచేసి
మీ సాక్ష్యములు చెప్పి ప్రభువును మహిమపరచండి.
ఆగస్టీన్: (నిలవబడి)
అయ్యా నా పేరు ఆగష్టీనండి. మాది వెలగలేరండి. 25సం.లు అలసర్ వ్యాధితో నొప్పి, బాధ
అనుభవించాను. ముదునూరుపాడు, గోటేరు వెళ్లానండి అయినా
తగ్గలేదు, మందులు పనిచేయలేదు. ఈ పాష్టరు గారు కత్తి పడవేసి, పాపములు ఒప్పుకోమన్నారు. కత్తి పడవేసాను. శత్రువులతో సమాధానపడ్డాను. రోగం
పోయింది. దేవునికి స్తోత్రం. (అందరూ హల్లెలూయ చెప్పాలి)
జఖరయ్య: అయ్యా నా
పేరు జఖరయ్యండి. మా ఊరు మార్టేరండి. నేను పనిచేసే దొరగారి సంస్థ నుండి కొన్ని దొంగ
వస్తువులు తెచ్చి నా పిల్లలకు పెట్టుటవలన వారు గజ్జి,
జ్వరాలతో రెండు సం.ల నుండి బాధపడ్డారు. పాష్టరు గారు చెప్పినట్లు నా పాపము
సరిచేసుకొని దొరగారి దగ్గర ఒప్పుకున్నాను. గజ్జి, జ్వరాలు
తగ్గిపోయాయి. దేవినికి స్తోత్రం.
సుందరమ్మ:
అందరికీ వందనాలండి. నా పేరు సుందరమ్మండి. మా ఊరు వనంపల్లి. నేను గవర్నమెంట్
ఆసుపత్రిలో పనిచేస్తూ కొన్ని దొంగ మందులు, దొంగ ఇనుపమంచం
తెచ్చుకోవడంవలన నా కుమార్తెని దయ్యము పట్టుకొని నాలుగు సం.ల నుండి పీడించింది.
పాష్టరు గారి వాక్యము విని దొంగ వస్తువులు టోరిగి ఇచ్చేశాను. దయ్యము
వెళ్లిపోయింది. దేవునికే స్తోత్రం.
సమూయేలు:
అందరికీ నమస్కారములండి. నా పేరు సమూయేలండి. మా ఊరు సత్యవరమండి. నేను భయంకరమైన
త్రాగుబోతునండి. నేను త్రాగి నా భార్యను కొట్టేవాడనండి. పాష్టరు గారు చెప్పిన
వాక్యము విని నా పాపముల కొరకు పశ్చాత్తాపపడ్డానండి. నా భార్యను క్షమాపణ అడిగానండి.
అంతే రాత్రి యేసు నన్ను ముట్టినారు. నాలో ఉన్న త్రాగుడు దెయ్యం పోయింది. నేను
బాగుపడ్డాను. దేవునికే స్తోత్రం.
పాష్టర్:
ప్రభువ్నండు ప్రియులారా. ఈ క్రిస్మస్ కాలములో క్రిస్మస్ బాలుని కిరణాలు మీ మీద
ప్రకాశించాయి. మీరంతా బాగుపడ్డారు. మన పాపం పోయి బాగుపడడమే నిజమైన క్రిస్మస్. ఈ
శుభసంధర్భములో క్రీస్తు బాలునికి ఒక స్తుతిగీతము పాడుకుందాము.
(అందరూ
కలిసి పాట పాడుచుండవలెను.)
ఓ
సద్భక్తులారా – లోక రక్షకుండు
సమాప్తం
Comments
Post a Comment