క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 1వ రంగము
1వ రంగము (ఒక గదిలో డాక్టర్ గారికి కావలసిన పరికరములతో అమర్చుకొని , క్లినిక్ గా చూపించాలి. డాక్టరు సిల్లీగా ఉండి అందరినీ నవ్వించాలి) డాక్టరు: ( తెరతీయగానే) క్లినిక్ తెరచి రెండు గంటలైంది. ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా రాలేదు. ఈరోజు ఎవరి ముఖము చూశానో ఏంటో.. అయినా ఈ మధ్య మా ఊళ్ళో ఎవరో ఒకాయన కొత్త భోధకుడు ప్రార్ధనలు , గీర్ధనలని మొదలుపెట్టాడు. ఆయనగారు ప్రార్ధనలు చేస్తుంటే ఎంతోమంది రోగులు బాగుపడిపోతున్నారంట. సరే నా దగ్గరకు వచ్చేవారు నాకు రాకుండా పోతారా ? చూద్దాం చూద్దాం (అని కనిపెట్టుచుండగా) ఆగస్టీన్: (కడుపునొప్పితో బాధపడుచూ) అమ్మా , అయ్యా , నొప్పి , నొప్పి , కడుపునొప్పి.. అమ్మో భరించలేకపోతున్నాను. (డాక్టర్ ని చూస్తూ) అయ్యా.. ఇక్కడ డాక్టర్ ఫటాఫట్ గారంటే ఎవరండి ? డాక్టరు: (కోపంతో) ఏమిటయ్యా చెట్టంత డాక్టరుని ముందు పెట్టుకుని డాక్టర్ ఫటాఫట్ గారెక్కడండి అంటారేంటి ? నేనే డాక్టర్ ఫటాఫట్ ని మన వైద్యానికి తిరుగులేదు. ఎలాంటి రోగమైన సరే చెప్పండి. చ...