Posts

Showing posts from October, 2022

క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 5వ రంగము

  5వ రంగము (చివరిరోజు ఉజ్జీవ కూటము అప్పటివరకు కొంత వాక్యము చెప్పినట్లుగా నటించాలి. ఈ కూటముల ద్వారా మేలు పొందిన రోగులు సాక్ష్యములు చెప్పాలి)   పాస్టరు గారు: ప్రభువునందు ప్రియులారా ఈ మూడు దినములు ఉజ్జీవ సభల ద్వారా మేలు పొందినవారు దయచేసి మీ సాక్ష్యములు చెప్పి ప్రభువును మహిమపరచండి. ఆగస్టీన్: (నిలవబడి) అయ్యా నా పేరు ఆగష్టీనండి. మాది వెలగలేరండి. 25సం.లు అలసర్ వ్యాధితో నొప్పి , బాధ అనుభవించాను. ముదునూరుపాడు , గోటేరు వెళ్లానండి అయినా తగ్గలేదు , మందులు పనిచేయలేదు. ఈ పాష్టరు గారు కత్తి పడవేసి , పాపములు ఒప్పుకోమన్నారు. కత్తి పడవేసాను. శత్రువులతో సమాధానపడ్డాను. రోగం పోయింది. దేవునికి స్తోత్రం. (అందరూ హల్లెలూయ చెప్పాలి) జఖరయ్య: అయ్యా నా పేరు జఖరయ్యండి. మా ఊరు మార్టేరండి. నేను పనిచేసే దొరగారి సంస్థ నుండి కొన్ని దొంగ వస్తువులు తెచ్చి నా పిల్లలకు పెట్టుటవలన వారు గజ్జి , జ్వరాలతో రెండు సం.ల నుండి బాధపడ్డారు. పాష్టరు గారు చెప్పినట్లు నా పాపము సరిచేసుకొని దొరగారి దగ్గర ఒప్పుకున్నాను. గజ్జి , జ్వరాలు తగ్గిపోయాయి. దేవినికి స్తోత్రం. సుందరమ్మ: అందరికీ వందనాలండి. నా పేరు సుందరమ్...

క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 4వ రంగము

  4వ రంగము (ఉజ్జీవ కూటములు జరుగుచున్న స్థలం , పాస్టరుగారు వేదిక మీద నిలువబడి ప్రసంగిస్తూ ఉంటారు. కూటం అయిపోయింది. ఒక్కొక్కరి సమస్యలు పాస్టరుగారికి రొగులు చెబుతారు) (పాపమువలన వచ్చు రోగములు గూర్చి భోదించాలి) పాస్టరుగారు: మీ పేరు ? ఆగస్టీన్: నా పేరు ఆగస్టీన్ అండి. పాస్టరుగారు: మీ సమస్య ఏమిటి ? ఆగస్టీన్: అయ్యా! నేను గత 25 సం.లుగా కడుపులో అల్సరుతో బాధపడుచున్నాను. నేను తిరగని ఆస్పత్రి లేదు , వాడని మందులు లేవు. ప్రార్ధన చేయించుకోని బోధకులు లేరు. అన్ని విధాల ప్రయత్నించాను , కానీ ఫలితం సూన్యం. నా సమస్యకు పరిష్కారం చెబుతారా ? పాస్టర్: అవును చెబుతాను , కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికి సరియైన జవాబు చెప్పాలి. ఆగస్టీన్: అలాగే చెబుతానండి. పాస్టరుగారు: నీ గ్రామములో నీకు ఎవరైనా శత్రువులున్నారా ? ఆగస్టీన్: అయ్యా! శత్రువులకు కడుపునొప్పికి సంబంధం ఏమున్నదండి ? మొన్న ఓ ప్రార్ధన కూటానికి వెళ్ళాను. ఆ పాస్టరమ్మ గారు నన్ను ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. శిలువ గుర్తు వేసి ప్రార్ధన చేశారు. పాస్టర్ గారు: మరి రోగం తగ్గిందా ? ఆగస్టీన్: తగ్గలేదండీ.. సరికదా ఇంకా ఎక్కువయ్యింది.. పాస్టర్ గా...

క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 3వ రంగము

  3వ రంగము (ఒక ప్రార్ధన మందిరములో కూటము జరుగుచుండగా ఆగస్టీన్ గారు , సుందరమ్మగారు , జకరయ్య గారు , సమూయేలు గారు , దేవదానం గారు లోపలికి వచ్చి కూర్చుంటారు) అబద్ధ బోధకురాలు: (లేచి నిలువబడి చేతిలో బైబిలు పట్టుకుని బోధ చేయాలి) ప్రభువునందు ప్రియులారా! ఈనాడు మనచుట్టూ ఎన్నో వేలాది సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలను నమ్మకండి. కొందరు భోదకులు పాపములు ఒప్పుకుని , పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందాలంటున్నారు. ఆ బోధలు నమ్మకండి. యేసు మనకొరకు రెండువేల సంవత్సరాల క్రితమే శిలువలో చనిపోయి రక్తము చిందించినారు. అప్పుడే మన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు పశ్చాత్తాపపడనక్కరలేదు , నమ్మి బాప్తీస్మము పొందండి మీకు రక్షణ దొరుకుతుంది. 7 వారాలు మా ప్రార్ధనకు వచ్చారంటే మీరు అనుకున్న కార్యాలు జరుగుతాయి. మీ రోగాలు తగ్గిపోతాయి. ప్రభువు తన వాక్యమును దీవించుగాక! ఆమెన్! ఇప్పుడు మీ సమస్యలు చెప్పండి. ఒక్కొక్కరికి ప్రార్ధన చేస్తాను. మీ పేరేమిటి ? మీ సమస్య చెప్పండి. ఆగస్టీన్: నా పేరు ఆగస్టీన్ అండి. నాకు 20 సం.ల నుండి కడుపులో పుండ్లు...... బాధ.... అమ్మా.... అయ్యా.... నొప్పి..... అబద్ధ బోధకురాలు: మీ పేరు చెప్పండి , మీ ...

క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 2వ రంగము

  2 వ రంగము (ఒక గదిలో మాంత్రికుడు తనకు తగినట్లు గదిని మార్చుకోవాలి. నిప్పుల కుంపటిపై నిప్పులు ఉంచి సాంబ్రాణి చల్లి పొగవచ్చునట్లు చేయాలి.) మాంత్రికుడు : ఓం.. రీమ్.. షటాషట్ , ఫటాఫట్ , ఓం.. రీమ్.. షటాషట్ , ఫటాఫట్ (అని మంత్రాలు వల్లిస్తూ చేతితో సాంబ్రాణి తీసుకుని నిప్పులమీద వేయాలి) (ఇంతలో ఒక దయ్యము పట్టిన పిల్లవానిని తండ్రి మాంత్రికుని దగ్గరకు తీసుకుని రావాలి) సుందరమ్మ: (పిల్లవాడు ఒళ్ళంతా విరుచుకుంటూ ఉండాలి) నమస్కారమండి మాంత్రికుడుగారు. మాంత్రికుడు: నమస్కారము , నమస్కారము అలా కూర్చోండి. ఎవరు ఈ పిల్లవాడు ఏమైనది చెప్పండి ? సుందరమ్మ: అయ్యా ఇతడు నా కుమారుడు. ఇతనికి దయ్యముపట్టి సంవత్సరమైనది. ఒళ్ళంతా విరుచుకుంటాడు. రాత్రులు మంచము మీద నుండి క్రిందికి పడిపోతాడు. ఎన్నో ఆస్పత్రులు త్రిప్పాము . తంత్రాలు , మంత్రాలు వేయించాము లాభంలేదు. మీరేమైనా సహాయం చేయగలరా ? మాంత్రికుడు: (నవ్వుతూ) ఆ.. ఆ.. తప్పక సహాయం చేస్తాము. ఓం..రీం.. షటాషట్ , ఫటాఫట్.. ఓం..రీం.. షటాషట్ , ఫటాఫట్.. (కళ్ళు మూసుకుని) పలకవే కాళి పలకవే ఊ..ఊ.. ఏయ్ శంభారీ.. ఆగు.. ఓం..రీం.. షటాషట్ , ఫటాఫట్...... మీ పేరు ? సుందరమ్మ: ...

క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 1వ రంగము

1వ రంగము (ఒక గదిలో డాక్టర్ గారికి కావలసిన పరికరములతో అమర్చుకొని , క్లినిక్ గా చూపించాలి. డాక్టరు సిల్లీగా ఉండి అందరినీ నవ్వించాలి) డాక్టరు: ( తెరతీయగానే) క్లినిక్ తెరచి రెండు గంటలైంది. ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా రాలేదు. ఈరోజు     ఎవరి ముఖము చూశానో ఏంటో.. అయినా ఈ మధ్య మా ఊళ్ళో ఎవరో ఒకాయన కొత్త భోధకుడు    ప్రార్ధనలు , గీర్ధనలని మొదలుపెట్టాడు. ఆయనగారు ప్రార్ధనలు చేస్తుంటే ఎంతోమంది రోగులు       బాగుపడిపోతున్నారంట. సరే నా దగ్గరకు వచ్చేవారు నాకు రాకుండా పోతారా ? చూద్దాం చూద్దాం       (అని కనిపెట్టుచుండగా) ఆగస్టీన్: (కడుపునొప్పితో బాధపడుచూ) అమ్మా , అయ్యా , నొప్పి , నొప్పి , కడుపునొప్పి.. అమ్మో       భరించలేకపోతున్నాను. (డాక్టర్ ని చూస్తూ) అయ్యా.. ఇక్కడ డాక్టర్ ఫటాఫట్ గారంటే ఎవరండి ? డాక్టరు: (కోపంతో) ఏమిటయ్యా చెట్టంత డాక్టరుని ముందు పెట్టుకుని డాక్టర్ ఫటాఫట్ గారెక్కడండి   అంటారేంటి ? నేనే డాక్టర్ ఫటాఫట్ ని మన వైద్యానికి తిరుగులేదు. ఎలాంటి రోగమైన సరే చెప్పండి.   చ...