దేవునిని ఆశ్రయించుట (నాటిక)
దేవునిని ఆశ్రయించుట ( నాటిక ) పాత్రలు: 1. అమ్మగారు 2. సీతయ్య (పనివాడు) 3. యేసయ్య 4. హీరోయిన్ సమంతా 5. డాక్టర్ 6. MLA 7. సేటు గారు (వడ్డీ వ్యాపారి) 8. అమ్మగారి అన్నయ్య (తెరతీయగానే లేదా లైట్స్ వేయగానే స్టేజీ మీద 6 కుర్చీలు వరుసగా వేసి ముందుగానే ఉండాలి. లైట్స్ వేయగానే పనిమనిషి ప్రవేశం) సీతయ్య: ( టవల్ తో కుర్చీలు తుడుస్తున్నట్టు నటిస్తూ ) అమ్మమ్మమ్మా పొద్దున్నుంచి ఒకటే పని జీతం తక్కువ , పని ఎక్కువ. చానా అనిసిపోయినాను. కొంచెంసేపు ఒక కునికేసుకుందాం. ( అని కుర్చీలో కూర్చొని ...